ప్రస్తుత కాలంలో ఆడ, మగ అనే భేదం లేకుండా ప్రతిఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఇప్పుడు ఉన్న కాలుష్యానికి జుట్టు పొడిబారడం, చుండ్రు సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి . ఇటువంటి సమస్యలను అధిగమించడానికి మందార ఆకులు,పువ్వులు మంచి ఔషధాలు.
మందార ఆకుల్లో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టు పొడిబారకుండా ఉండటంలో ఎంతో దోహదపడుతుంది . జుట్టు రాలే సమస్యలకు మందార ఆకులు ఎలా దోహదపడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం .
జుట్టు పెరుగుదలకు మందార పువ్వులు,ఆకులు ఉపయోగాలు (hibiscus leaves for hair growth)
టిప్ 1:
ముందుగా 3 నుండి 4 టేబుల్ స్పూన్ల మెంతులను ముందు రోజు నానపెట్టాలి. కొన్ని మందార ఆకులను తీసుకుని , వాటిలో 2 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు , మెంతులను కలిపి బాగా మెత్తని పేస్ట్ చేసుకోవాలి . ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి 30 నిముషాల తరువాత గాఢత తక్కవ గల షాంపూతో తలస్నానం చేయాలి . ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం లభిస్తుంది.
టిప్ 2:
కావలసినవి:
మందార పువ్వు
మందార ఆకులు
4 టీ స్పూన్లు పెరుగు
తయారు చేసే విధానం
ముందుగా మందార పువ్వును ఆకులతో కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.వచ్చిన మందార మిశ్రమానికి 4 టీ టీస్పూన్ పెరుగు కలపాలి .ఇప్పుడు చక్కని హెయిర్ మాస్క్ తయారు అవుతుంది.ఈ హెయిర్ మాస్క్ నీ మీ జుట్టు కుదుళ్లకు బాగా రాసుకుని ఒక గంట పాటు అలాగే ఉంచండి.తరువాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి .మీరు ఈ హెయిర్ మాస్క్‌ను వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించవచ్చు.
టిప్ 3:
మందార ఆకులు కొందరికి అందుబాటులో ఉండవు . అటువంటి వారు మందార నూనెను తయారు చేసుకుని వాడుకోవచ్చు . అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావలిసిన పదార్ధాలు :
మందార ఆకులు – 10-15
కరివేపాకు రెమ్మలు-10
కొబ్బరి నూనె -1/4 కేజీ
ముందుగా మందార ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి . కొబ్బరి నూనెను ఒక గిన్నెలో పోసి కొద్దిగా వేడి కాగానే మందార ఆకులను ,కరివేపాకులను కలిపి ఒక 10 నిముషాలు వేడిచేయాలి. ఆ తరువాత స్టవ్ ఆపివేసి, నూనె చల్ల బడిన తరువాత నూనెను వడకట్టాలి . ఈ నూనెను ఒక బాటిల్ లోకి తీసుకోవాలి .
ఈ నూనెను మీరు తలస్నానం చేసే ముందు రాసుకుని ఒక 30 నిముషాల తరువాత తల స్నానం చేయాలి.లేదా ఈ నూనెను మీరు రోజు తలకు రాసుకోవచ్చు .