ఈ సంవత్సరం రెండవ చివరి చంద్ర గ్రహణం నవంబరు 8వ తేదీన, రేపు ఏర్పడబోతుంది. ఈసారి చంద్రగ్రహణం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల 19 నిమిషాలకు ముగుస్తుంది. ఈ చంద్ర గ్రహణం మేష రాశి, భరణి నక్షత్రంలో సంభవిస్తుంది.
ఈ చంద్ర గ్రహణం ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కుంభ, మిథునం, వృశ్చికం , కర్కాటకం రాశులకు శుభ ఫలితాలు.
మీన, ధను, తుల, సింహ రాశులకు మధ్యమ ఫలితాలు.
మేష, వృషభ, కన్య, మకర రాశుల అధమ ఫలితాలు.
చంద్ర గ్రహణం సమయంలో ఈ మంత్రం, శ్లోకం చదివితే మంచి ఫలితాలు పొందుతారు.
చంద్ర గాయత్రి మంత్రం
ఓం అమృతేశాయ విద్మహే
రాత్రిన్చరాయ ధీమహి
తన్నశ్చంద్రః ప్రచోదయాత్.
చంద్ర నవగ్రహ శ్లోకం
దధి శంఖ తుషారాభం | క్షీరోదార్ణవ సంభవమ్
నమామి శశినం సోమం | శంభోర్మకుట భూషణం ||
ఇది చేయలేని వారు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం కూడా జపించవచ్చు.
చంద్ర గ్రహణం అనంతరం చంద్ర బింబం, నాగ పడగ ధానం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు.