Aloe vera-ఇప్పుడు ఉన్నటువంటి ఉరుకుల పరుగుల జీవితంలో జుట్టు పై రక్షణ తీసుకోవడం చాలా కష్టతరంగా ఉంది. ప్రస్తుతం ఉన్న కాలుష్యానికి జుట్టు రాలిపోవడం ,పొడిబారడం వంటి సమస్యలతో భాదపడుతున్నారు .
మగువలకు జుట్టు అంటే చాలా ఇష్టం . జుట్టుకి సరియైన పోషణ ఇవ్వాలని తపిస్తూ ఉంటారు.జుట్టు అందంగా , పట్టులా మెరవడానికి అద్భుతమైన చిట్కా.
టిప్ 1:
కావలసిన పదార్ధాలు :
అలోవెరా – 4స్పూన్లు
పెరుగు- 4 స్పూన్లు
కొబ్బరినూనె -2 స్పూన్లు
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో అలోవెరా (కలబంద) గుజ్జు తీసుకుని,అందులో 4 స్పూన్లు పెరుగు, 2 స్పూన్లు కొబ్బరినూనె కలిపి మిక్సి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తరువాత తల స్నానం చేయాలి .ఇలా వారానికి ఒకసారి చేస్తే మీ జుట్టు సిల్కీగా మారుతుంది. ఈ చిట్కాను క్రమం తప్పకుండా చేయడంవలన పొడిబారిన జుట్టు మృదువుగా తయారవుతుంది.
పెరుగు జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.పెరుగులో బ్యాక్టీరియా స్థాయి అధికంగా ఉంటుంది. ఇవి శరీరంలో ఎంజైమ్‌లు ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. పెరుగు మాస్క్ జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. దీంలో జుట్టు సిల్కీగా మారుతుంది.చుండ్రు సమస్యలను అరికట్టవచ్చు.
కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కలబందలో ఉండే విటమిన్ ఇ, ఎ, సి లు జుట్టు పెరుగుదలకు కావలసిన పోషణ అందించి జుట్టు ఒత్తుగా బలంగా పెరిగేందుకు సహాయపడతాయి. ఇవి తలలో రక్తప్రసరణ మెరుగుదలకు సహాయపడి జుట్టు పెరగడాన్ని బలోపేతం చేస్తాయి.