సాధారణంగా మనం తయారుచేసుకునే సాంప్రదాయ తీపి వంటకాలలో బెల్లం వాడుతుంటాము. అరిసెలు, బూరెలు , కాజా ఇటువంటి ప్రాంతీయ వంటకాలను బెల్లం తో తయారు చేస్తారు. మన పెద్దలు ఎక్కువ శాతం బెల్లం ను ఉపయోగించేవారు . బెల్లం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits of Jaggery/Bellam in Telugu)
బెల్లం లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బెల్లంలో రక్తాన్ని శుద్ధి చేసే ఔషధ గుణాలు ఉండడం వలన దీన్ని తింటే రక్తం బాగా తయారవుతుంది. ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. రక్తం వృద్ధి చెందుతుంది.
మలబద్దకం (Constipation) తో బాధపడేవారు నిత్యం బెల్లం తింటే ఉపశమనం లభిస్తుంది. భోజనం చేసిన తరువాత చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని చప్పరిస్తూ మింగాలి. ఇలా కొద్ది రోజుల పాటు చేస్తే మలబద్దకం సమస్య ఉండదు.
దగ్గు, జలుబు ఉన్నవారు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో చిన్న బెల్లం ముక్క వేసి బాగా కలిపి ఆ నీటిని తాగితే జలుబు సమస్యల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం చేత , దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
బెల్లంలో ఉండే పోషకాలు మహిళలకు నెలసరి సమయంలో వచ్చే సమస్యలను తగ్గిస్తాయి.
పాలలో బెల్లం కలిపి తాగినా బోన్స్ బలంగా తయారవుతాయి. ఆర్థ్రైటిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
మగవారు బెల్లం రెగ్యులర్ గా తీసుకోవడం వలన స్పెర్మ్ క్వాలిటీ పెరుగుతుంది.. దీంతో సంతాన సమస్యలు దూరమవుతాయి .
బెల్లానికి శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంది. అందువల్ల బెల్లం వేసి తయారు చేసిన పానకం వంటి మిశ్రమాన్ని వేసవిలో తాగితే మంచిది.
.