ప్రస్తుత కాలంలో మనిషి అందంగా కనిపించడం కోసం ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు.వివిధ రకాలైన హెయిర్ ఆయిల్లు వాడి అవి జుట్టుకి సరిపడక ఉన్న జుట్టు, అందాన్ని పాడు చేసుకుంటున్నారు. మన ఇంట్లో ఉండే వాటితో మన జుట్టును ఒత్తుగా పెరిగేలా చేసే చిన్న చిట్కా చూద్దాం .
బియ్యం నీరు (Rice Water) అనేక పోషక విలువలు ఉన్నాయి . బియ్యాన్ని కడిగిన నీరు మనం పారేస్తుంటాం. కానీ, దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.బియ్యం కడగగా వచ్చిన నీళ్లులో విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. జుట్టులో ఉండే మురికిని ఈ నీరు తొలగించి జుట్టు మూలాలను బలంగా, మృదువుగా మరియు మెరిసేలా చేస్తుంది.
బియ్యం నీటిలో ఇనోసిటాల్ మరియు కార్బోహైడ్రేట్లు ఉండటం ఇది మీ పొడి మరియు పెళుసైన జుట్టును నయం చేస్తుంది. మీరు మీ జుట్టును బియ్యం నీటితో కడిగినప్పుడు, ఇనోసిటాల్ జుట్టు మీద పొరగా పనిచేస్తుంది మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
బియ్యం నీటిలో అమైనో ఆమ్లాలు ఉంటాయి. కాబట్టి బియ్యం నీరు మీ జుట్టుకు, సహజమైన, సురక్షితమైన మరియు ఎటువంటి దుష్ప్రభావాలు లేని ప్రయోజనకరమని చెప్పవచ్చు.
- బియ్యం కడిగిన నీరు జుట్టుకి కాకుండా ముఖానికి కూడా మేలు చేస్తాయి. ఈ నీటితో ముఖం కడగటం
వలన ముఖంపై మొటిమలు పోయి, చర్మం కాంతివంతంగా తయారవుతుంది. - బియ్యం నీరు చర్మాన్ని ఎండ నుండి కాపాడుతుంది . మీ చర్మం పై ముడతలు తగ్గించి మరింత యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
- చర్మ కాన్సర్ రాకుండా రక్షిస్తుంది.