హిందువులు ప్రతి సంవత్సరం జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటి. మహా విష్ణువు ఏడవ అవతారమే శ్రీరామ అవతారంగా పురాణ గాథల్లో తెలుపబడింది.
శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి,పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల సమయంలో అంటే మిట్టమధ్యాహ్నాం జన్మించాడు అని పురాణాలు తెలియజేశాయి. ఈ ప్రకారంగా, ప్రతీ ఏడాది చైత్రమాసంలో అమావాస్య తర్వాత 9వ రోజున వచ్చే నవమిని ‘శ్రీరామ నవమి’ గా గుర్తిస్తారు. ఇది చైత్ర నవరాత్రుల ముగింపును కూడా సూచిస్తుంది.

ఈ ఏడాది శ్రీరామ నవమి పండుగను మార్చి 30 న జరుపుకోవడం జరుగుతుంది.. రామనవమి పూజకు ఉత్తమ పూజా ముహూర్తం మధ్యం ఉంది. నవమి తిథి మార్చి 29, 2023 రాత్రి 09:07 గంటలకు ప్రారంభమై, 2023 మార్చి 30 రాత్రి 11:30 గంటలకు ముగుస్తుంది. శ్రీరామనవమి పూజా కార్యక్రమాలను నిర్వహించడానికి మధ్యకాలం అత్యంత పవిత్రమైన సమయమని పూజారులు చెబుతున్నారు.
ఈరోజు ఆలయాలలో సీతారామ కల్యాణం జరిపిస్తారు.ముఖ్యంగా శ్రీరామనవమి రోజు వడపప్పు,పానకం తయారు చేసి స్వామివారికి నివేదించాలి.
రామాయణగాథ ఏదైనా చదువుకోవాలి.సంతానం కోసం చూసే వారు పుత్ర కామేష్టి యాగం గురించి విన్న, చదివిన సంతానం కలుగుతుందని నమ్మకం.